Header Banner

కాశ్మీర్‌లో లష్కరే తొయిబా ఓజీడబ్ల్యూ మాడ్యూల్‌ సభ్యుల అరెస్ట్! ఏకంగా చైనీస్ ఆయుధాలతో!

  Thu Apr 24, 2025 13:30        India

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (ఓజీడబ్ల్యూ) మాడ్యూల్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రెండు వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు ఓజీడబ్ల్యూలను అరెస్ట్ చేసి, వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కనిపోరా నైద్ఖాయ్ సుంబాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మహమ్మద్ రఫీక్ ఖాండే, ముఖ్తార్ అహ్మద్ దార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక 7.62 ఎంఎం మ్యాగజైన్, 30 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఆపరేషన్‌లో భాగంగా సదునారా అజాస్ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో రేయీస్ అహ్మద్ దార్, మహమ్మద్ షఫీ దార్ అనే మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కూడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నలుగురు నిందితులు లష్కరే ఓజీడబ్ల్యూ నెట్‌వర్క్‌లో సభ్యులుగా ఉన్నామని, అజాస్, నైద్‌ఖాయ్ సుంబల్ పరిసర ప్రాంతాల్లో దాడులకు తమకు ఆదేశాలు అందినట్లు, దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై సుంబాల్ పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: ఉగ్రదాడిపై అన్ని పార్టీలతో చర్చించనున్న కేంద్రం! రాజ్‌నాథ్ సింగ్‌ అధ్యక్షతన భేటీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LashkareToiba #OGWModule #KashmirSecurity #ChineseWeapons #CounterTerrorism #TerrorismPrevention